ఛలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ 

నవతెలంగాణ – కంటేశ్వర్
ఈ నెల 8న బీసీల డిమాండ్ల సాధన కొరకు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారని, అందులో భాగంగా శనివారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “ఛలో ఢిల్లీ” పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడారు..స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కుడ బీసీల కుల గణన లేకపోవడం శోచనీయం అని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను పెట్టి బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కార్యదర్శి సత్యప్రకాశ్ అన్నారు. బీసీలకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపె రవిందర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, సత్యప్రకాశ్, కరిపె రవింధర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, కోడూరి స్వామి, చంద్రమోహన్, సంజీవ్,విజయ్, బసవ కుమార్, మురళి, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.