
మండలంలోని మద్దికుంటలో శనివారం ఐమాక్స్ లైటును ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ ఒక లక్ష 50 వేల మండల పరిషత్ నిధులతో లైట్ ను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొమ్మిడి రాంరెడ్డి, ఎంపిటిసి రాజేందర్, వార్డ్ మెంబర్ సాయి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తోట లింగం, రాజా గౌడ్, పంచాయతీ కార్యదర్శి హరిలతా తదితరులు పాల్గొన్నారు.