మాన్యావర్ సరికొత్త సౌత్ కలెక్షన్ లో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శోభిత దూళిపాళ్ల
వేదాంత్ ఫ్యాషన్ లిమిటెడ్ తన వెడ్డింగ్ కలెక్షన్ లో భాగంగా అందరికి గౌరవానని తెచ్చిపెట్టే వేష్టి మరియు పంచకచమ్ లను పరిచయం చేసింది. బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్వారా ఈ అనుబంధాన్ని దక్షిణ భారతదేశంలో ఆవిష్కరించింది.
వివాహ వేడుకల్లో వరుడు ధరించే వస్త్రాలు మరియు ప్రతీ పండుగ సందర్భంగా పురుషులు ధరించే సంప్రదాయ వస్త్రాల విభాగంగా అగ్రగామిగా ఉన్న సంస్థ మాన్యవర్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన వేడుకలకు సంబంధించిన వస్త్రాలను ప్రపంచానికి అందించిన మాన్యావర్.. తాజాగా వివాహ కలెక్షన్ లో భాగంగా పంచకచం మరియు వేష్టికి సంబంధించిన వస్త్రాలను దక్షిణ భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మాన్యవర్ విభాగంలో ఇది ఒక అద్భుతమైన మైలురాయి. అంతేకాకుండా ఇది దక్షిణ భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని స్వీకరించడానికి మాన్యావర్ సదా సిద్ధంగా ఉందని చెప్పేందుకు కూడ నిదర్శనందా భావించవచ్చు.
ఈ అద్భుతమైన ప్రారంభానికి గుర్తుగా, మాన్యావర్ #TaiyaarHokarAiye బ్యానర్‌పై ఒక ఆకర్షణీయమైన క్యాంపెయిన్ ఫిల్మ్ ను ఆవిష్కరించింది. ఈ ఫిల్మ్ లో బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ తన వివాహ వేడుక కోసం పంచకచం ధరించి కన్పిస్తారు. ఇందులో ఆయనకు జోడీగా శోభిత దూళిపాళ్ల నటంచింది.
క్యాంపెయిన్ లో నటించిన రామ్ చరణ్ మరియు శోభిత జంట.. దక్షిణ భారతదేశం యొక్క వివాహ వేడుకల్ని, వివాహ వేడుకల యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేదిగా ఉంది. అంతేకాకుండా వారసత్వం మరియు ఆధునికతను సమపాళ్లలో జోడించండం ద్వారా మాన్యావర్ నిబద్ధతతో స్పష్టంగా కన్పిస్తుంది. ఇక ఇందులో “తైయార్ హోకే ఆయే” అనే ట్యాగ్ లైన్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. వరుడి పాత్రలో కన్పించిన రామ్ చరణ్ తన సొంత వివాహానికి ఆలస్యంగా వస్తాడు. ఆ క్షణంలో వరుడి కోసం ఎదురుచూస్తున్న వధువు ముఖం చిన్నబోతుంది. దాన్ని అర్థం చేసుకున్న వరుడు… తన ఆలస్యానికి కారణం చెప్పి ఆమె మోముపై చిరునవ్వులు చిందేలా చేస్తాడు. ఆ క్షణంలో వధువు హృదయాన్ని గెల్చుకునేందుకు రామ్ చరణ్ చేసేది నిజంగా మీ హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
ఈ ఉద్వేగభరితమైన ఫిల్మ్, మేకింగ్. దక్షిణ భారతదేశంలో వివాహ బంధానికి, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాముఖ్యతను చాటిచెప్తుంది. ఈ సందర్భంగా ఉపయోగించే సంప్రదాయ వస్త్రాలు, అందులో భాగమైన పంచకచం యొక్క గొప్పదనాన్ని వివరిస్తుంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… ” నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను… వివాహం సందర్భంగా మనం ఉపయోగించే ప్రతీ వస్తువు దక్షిణ భారత వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక వస్త్రాలు అయితే ప్రతీ పోగులో మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్తాయి. నాకు మాన్యావర్‌పై చాలా అభిమానం ఉంది. అందుకే వారి క్యాంపెయిన్ లకు తరచుగా వస్తుంటాను. నేను వీటిగా ఆస్వాదిస్తున్నాను. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది మన ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలకు, దాని వెనుక ఉన్న కళాత్మకతకు, దక్షిణ భారత వస్త్రధారణ యొక్క శాశ్వతమైన ఆకర్షణకు నివాళిగా ఉంటుంది అని అన్నారు.
ఈ సందర్భంగా వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ వేదాంత్ మోడీ కొత్త లాంచ్ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… “మాన్యావర్ యొక్క కలెక్షన్ లో పంచకచం, వేష్టిని ప్రవేశపెట్టడం అనేది శక్తివంతమైన దక్షిణ భారత మార్కెట్లోకి మా వ్యూహాత్మక విస్తరణను సూచిస్తుంది. ఈ ప్రాంతానికే చెందిన అద్భుతమన, గౌరవనీయమైన వ్యక్తి రామ్ చరణ్‌తో ఈ సహకారం మరువలేనిది. ఆయన దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రామాణికంగా స్వీకరించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. దక్షిణ భారతదేశానికి ప్రత్యేకమైన దుస్తులను అందించడం ద్వారా, రామ్ చరణ్ వంటి ప్రియమైన వ్యక్తితో భాగస్వామ్యం చేయడం ద్వారా, దక్షిణాదిలోని వినియోగదారులతో లోతైన బంధాన్ని ఏర్పరచుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ వ్యూహాత్మక తరలింపు వారి ప్రత్యేక ప్రాధాన్యతలను తీర్చగలం. అంతేకాకుండా ఇది మా బ్రాండ్ యొక్క వైవిధ్యం, అంకితభావాన్ని బలపరుస్తుంది. దీనిద్వారా మా బ్రాండ్ మరింత వృద్ధిని సాధిస్తుందని మేము నమ్ముతున్నాము. తద్వారా దక్షిణ భారతదేశ మార్కెట్‌లో బలమైన సంబంధాలను పెంపొందించుకుంటాము. అదే విధంగా గౌరవించబడే బ్రాండ్‌గా మాన్యవర్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.” అని అన్నారు.
ఈ సందర్భంగా శ్రేయాన్ష్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ శ్రేయాన్ష్ బైద్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “మాన్యవర్, తైయారి రెండూ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఇన్నాళ్లు, తైయార్‌హోకర్ఆయే చుట్టూ ఉన్న ప్రత్యేకమైన కథనాల ద్వారా, పెళ్లికి సిద్ధంగా ఉండటం అనే ప్రాముఖ్యతను బ్రాండ్ నిర్మించింది. ఇప్పుడు సూపర్ స్టార్ రామ్‌చరణ్ సహకారంతో, మేము కేవలం శారీరక వేషధారణకు మించి, మానసికంగా కూడా సిద్ధంగా ఉండటానికి తయారీ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాము. వధువు, వరుడు వారి వివాహ ఆచారాల ద్వారా వెళుతున్నప్పుడు వారి మధ్య ప్రత్యేకమైన ఆలోచనల బంధాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. ఫిల్మ్ మరింత ముందుకు వెళ్తున్న కొద్దీ, వివాహ బంధంలోకి ప్రవేశించే సమయంలో ఎదురయ్యే అనిశ్చితి గురించి, రామ్‌చరణ్ తనకు, తన వధువుకు ఈ కొత్త జీవితానికి నిజంగా తానే అని భరోసా ఇచ్చాడు.
రామ్ చరణ్, శోభిత సహకారంతో వారసత్వం, ఆధునికతను సమపాళ్లలో అందించడంలో మాన్యావర్ యొక్క నిబద్ధత ఇందులో ప్రతిధ్వనిస్తుంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న మాన్యావర్ దంపతుల మధ్య జరిగిన సంతోషకరమైన మార్పిడిని ఈ చిత్రం సరదాగా వర్ణిస్తుంది. పూర్తి స్పష్టతగా ఉండడం, ప్రేమతో నిండిన సంబంధాన్ని పెంపొందించడం, ఎటువంటి సందేహాలకు తావులేని ఉన్నటువంటి సంభాషణ వివాహ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది.
ఇక కలెక్షన్ గురించి చెప్పాలంటే ఖచ్చితమైన హస్తకళను, దక్షిణ భారత సౌందర్యంపై అవగాహన మేళవింపులో వీటిని రూపొందించారు. అధునాతనత, సాంస్కృతిక గొప్పతనాన్ని సంపూర్ణంగా అందిస్తుంది. సాంప్రదాయం, శైలి, అసమానమైన హస్తకళల సామరస్యపూర్వకమైన సింఫొనీని వాగ్దానం చేస్తూ, దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక ఫాబ్రిక్‌లోకి మాన్యావర్ ప్రవేశాన్ని సూచిస్తుంది.మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి https://www.manyavar.com/en- మాన్యావర్ ను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవ్వండి https://www.instagram.com/
మీకు సంబంధించిన అత్యుత్తమ దుస్తులు, ఫ్యాషన్ వేడుక & వివాహ దుస్తుల సేకరణలో ఉత్తమమైన వాటిని తీసుకువస్తోంది మాన్యావర్. ఈ కలెక్షన్ వరుడికి ఒక స్టైలిష్ మేక్ఓవర్ ఇస్తుంది. అది వారి రోజును ఫ్యాషన్‌గా ప్రత్యేకంగా చేస్తుంది. హస్తకళ నిపుణులు రూపొందించిన వస్త్రాలపై అధునాతన ఎంబ్రాయిడరీ వర్క్ తో, మాన్యవర్ మీ స్టైల్ ను మరింతగా పెంచుకునేందుకు అవకాశాన్ని అందిస్తుంది.
వేదాంత్ ఫ్యాషన్స్… మోహే ద్వారా మహిళలకు వివాహ, వేడుకల దుస్తులను అందిస్తుంది. దాని ప్రాంతీయ వారసత్వ బ్రాండ్ మెబాజ్‌తో మొత్తం కుటుంబానికి కావాల్సిన సంప్రదాయ దుస్తుల్ని అందిస్తుంది.