మీడియా సెంటర్‌ ప్రారంభం

– ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకట్రావ్‌
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మీడియా సెంటర్‌, ఏంసిఏంసి కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ సి.హెచ్‌. ప్రియాంకతో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్నికల సమాచారం మీడియాకు సెంటర్‌ ద్వారా అందచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా కీలకమని, దేశపాలన, పౌరులకు సేవలు అందించుటలో మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాకు సంబంధించిన పెయిడ్‌ న్యూస్‌, ఫిర్యాదులు వాటి సమస్యలు పరిశీలించడం అలాగే దినపత్రికలలో వచ్చే వార్తలు, ఎలక్ట్రానిక్‌, కేబుల్‌ ప్రకటనలు పరిశీలన చేస్తామని అన్నారు. మీడియా సెంటర్‌లో సిబ్బంది తో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల వారీగా ఎన్నికల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అంతట ఎం.సి.సి. అమలులో ఉన్నదని ఈ సందర్బంగా కలెక్టర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్‌.ఓ ఏ. రమేష్‌ కుమార్‌, డి.ఈ. ఐ ఈ మల్లేశం, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, ఏ.ఓ సుదర్శన్‌ రెడ్డి, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.