భారతదేశం వ్యాప్తంగా బీమా సౌలభ్యాన్ని మెరుగుపరచే దిశలో, విజయవాడలోని న్యూ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో తన అడుగుజాడలను విస్తరించిన పీబీ పార్ట్‌నర్స్ (PBPartners).పట్టణాలు, చిన్న నగరాలు, నగరాల్లో విస్తరించి ఉన్న 16 బ్రిక్ అండ్ మోర్టార్ సెంటర్‌ల నెట్‌వర్క్‌కు విజయవాడ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ సరికొత్తగా వచ్చి చేరింది.
పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ క్రింద ఉన్న బ్రాండ్, పీబీ పార్ట్‌నర్స్ (PBPartners) కాగా, దాని పీఓఎస్‌పీ (PoSP) మోడల్ ద్వారా ముఖ్యంగా పట్టణాలు, చిన్న నగరాల్లో బీమా సౌలభ్యాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉంది. విస్తృతమైన ఏజెంట్ భాగస్వామి శిక్షణ, మరియు అత్యాధునిక సాంకేతికతపై దృష్టి సారించి, పీబీ పార్ట్‌నర్స్ మంచి భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా, పీబిపార్ట్‌నర్స్ ఇటీవల విజయవాడలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏజెంట్ భాగస్వామి ఎంగేజ్‌మెంట్ మరియు అప్-స్కిల్‌మెంట్ పట్ల పీబీ పార్ట్‌నర్స్ కొనసాగిస్తున్న నిబద్ధతను కలిగి ఉంటాయి. ఈ కేంద్రాల ద్వారా, పీబీ పార్ట్‌నర్స్ తమ ఏజెంట్ భాగస్వాములు నిలకడగా ప్రేరేపించబడుతూ, గుర్తింపు పొందారని, పనితీరు మరియు అంకితభావంతో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు ప్రేరణ పొందారని నిర్ధారిస్తుంది. ఏజెంట్ భాగస్వాములు మరియు వ్యాపార నాయకుల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఇవి కీలకమైనవి.
ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు పోషించే కీలక పాత్ర:
వ్యూహాత్మక చర్చలకు సహకరించే స్థలం: భారతదేశం వ్యాప్తంగా, ముఖ్యంగా వారి ప్రాంతాలలో బీమా కవరేజీని విస్తరించే వ్యూహాలపై దృష్టి సారిస్తూ, పీబీ పార్ట్‌నర్స్ వ్యాపార బృందాలతో మెరుగైన సంభాషణలలో పాల్గొనేందుకు ఏజెంట్ భాగస్వాములకు అనుభవ కేంద్రాలు వేదికను అందిస్తాయి.
నాలెడ్జ్ షేరింగ్ మరియు నైపుణ్యం: ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు జ్ఞానం మరియు నైపుణ్యం మార్పిడిని సరళం చేస్తాయి. ఏజెంట్ భాగస్వాముల నైపుణ్యాలు మరియు అవగాహనను మెరుగుపరుస్తాయి.
సాధికారత మరియు సముదాయ సేవ: ఈ ప్రయత్నం ఏజెంట్ భాగస్వాములను శక్తివంతం చేస్తుంది. వారి సముదాయాలకు మెరుగైన సేవలు అందించేందుకు, భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌లో బీమా కవరేజీని విస్తరించుకునేందుకు సహాయపడుతుంది.
విజయవాడలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడం పట్ల పీబీపార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ సారిన్ హర్షం వ్యక్తం చేస్తూ, ‘‘మేము ప్రారంభం నుంచి భారతదేశంలోని ప్రతి మూలకు బీమాను విస్తరించడమే మా లక్ష్యంతో పని చేస్తున్నాము. మా ఏజెంట్ భాగస్వాములకు భరోసా ఇచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము. వారు సంతృప్తి చెందడమే కాకుండా, వారి ప్రయాణంలో అవసరమైన వనరులు, మార్గదర్శకత్వంతో పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము మా ఏజెంట్ భాగస్వాములను మరింతగా ప్రోత్సహించి, వారి సేవలను విస్తరించడమే మా అగ్ర ప్రాధాన్యతగా ఉండడంతో, విజయవాడలో ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఆ లక్ష్యాలను సాధించడంలో ఈ అనుభవ కేంద్రాలు చాలా ముఖ్యమైనవి. ఈ మైలురాయి పీబీ పార్ట్‌నర్స్‌ను మరింత గొప్ప విజయం వైపు నడిపిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని తెలిపారు.
పీబీ పార్ట్‌నర్స్ తన పరిధిని విస్తరించడాన్ని కొనసాగిస్తుండడంతో ఏజెంట్ భాగస్వాములను శక్తివంతం చేయడం, భారతదేశం వ్యాప్తంగా బీమాను అందుబాటులోకి తీసుకురావడం అనే కంపెనీ లక్ష్యానికి అంకితమైంది. కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ దేశవ్యాప్త ఆర్థిక సమ్మేళనాన్ని సాధించే పరిశ్రమ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తోంది.