తొలి ఎక్స్పీరియన్స్ హబ్ ను ప్రారంభం

– మాటర్ అహ్మదాబాదు నుండి ఏఈఆర్ఏ డెలివరీస్ ను మొదలుపెట్టింది

  • అహ్మదాబాదులోని తన నూతన ఎక్స్‎పీరియన్స్ హబ్ యొక్క ప్రారంభోత్సవములో మాటర్ భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ విద్యుత్ మోటార్ బైక్ ఏఈఆర్‎ఏ యొక్క డెలివరీని అధికారికంగా ప్రారంభించింది.
  • బైకర్స్ కొరకు ప్రత్యేకమైన, లీనమయ్యే అనుభవాన్ని అందించే ఒక ‘ఫిజిటల్’ స్పేస్ లో సాంకేతికత, డిజైన్ మరియు వినియోగదారు ప్రమేయాలను అంతరాయాలు లేకుండా కలుపుటకు మాటర్ ఎక్స్పీరియన్స్ హబ్ రూపొందించబడింది.
  • ఒకే చార్జ్ లో 170 kmin ధృవీకరించబడిన శ్రేణిని అందించే భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ విద్యుత్ మొటార్ బైక్.

అహ్మదాబాదు: ఈవి సాంకేతికత మరియు ఇంధన నిల్వ పరిష్కారాలలో అగ్రగామి అయిన మాటర్ గ్రూప్, శక్తివంత నగరం అహ్మదాబాదులో మొట్టమొదటి ఎక్స్‎పీరియన్స్ హబ్ ను ప్రారంభించింది. ఈ వేడుకలో మాటర్ యొక్క వ్యవస్థాపకులు మరియు ఇతర బృందముతోపాటు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ. గోవింద్ భాయ్ ధోలకియా పాల్గొన్నారు. ఈ కొత్త స్పేస్ ఆవిష్కరణ, ఆడంబరము మరియు సుస్థిరతలకు ఉదహరిస్తుంది మరియు వినియోగదారులకు భౌతిక మరియు డిజిటల్ ప్రపంచాలను ఒక ‘ఫిజిటల్’ వాతావరణాలను సమ్మిళితం చేయడం ద్వారా తర్వాతి-తరం రీటెయిల్ అనుభవాన్ని అందిస్తుంది. అహ్మదాబాదు నడిబొడ్డులోని నవరంగపురా లో ఉన్న మాటర్ ఎక్స్‎పీరియన్స్ హబ్ కేవలం ఒక రీటెయిల్ అవుట్‎లెట్ మాత్రమే కాదు, ఇది ద్వి-చక్ర వాహన కొనుగోలు అనుభవాన్ని పునర్నిర్వచించుటకు సాంకేతికత, ఉత్పత్తి అన్వేషణ, జీవనశైలి మరియు కస్టమర్ కేర్ కలిసే ఒక ప్రత్యేకమైన మరియు వినూత్నమైన చోటు. ఆధునిక ఓపెన్ స్పేసెస్ నుండి ప్రేరణ పొందిన ఈ హబ్ లో భవిష్యత్ మరియు ఆచరణాత్మక ఇంటీరియర్స్ ఉంటాయి. వీటి వలన సందర్శకులు వివిధ ఇంటరాక్టివ్ జోన్స్ ను శ్రమలేకుండా చూడగలుగుతారు.
టెక్-ఫార్వర్డ్ స్థాపనలు మరియు జీవనశైలి అందాల సమ్మేళనాన్ని అందించుటకు తయారుచేయబడిన స్పేస్ లతో యూజర్ ప్రయాణాన్ని మెరుగుపరచుటపై ఇంటీరియర్ డిజైన్ దృష్టి సారిస్తుంది. ఇంటరాక్టివ్ టచ్ పాయింట్స్ నుండి లీనమయ్యే డిస్ప్లే వరకు, స్పేస్ అనేది ఆవిష్కరణ మరియు సుస్థిరతల పట్ల మాటర్ కు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సహజ వస్తువులను మరియు ఆధునిక డిజిటల్ ఇంటర్ఫేసుల పక్క పక్కనపెడితే వాతావరణాన్ని ముందుచూపుతో ఆలోచించేలా చేస్తుంది. మాస్టర్ ఏఈఆర్‎ఏ డిస్ప్లే ఒక సెంట్రల్ విజువల్ ఫోకల్ పాయింట్ గా పనిచేసి, భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ విద్యుత్ మోటార్ బైక్ ను ప్రాధాన్యీకరిస్తుంది, అలాగే టెక్ డిస్ప్లే మరియు ఇంటరాక్టివ్ ఫీచర్ జోన్స్ బైక్ యొక్క సామర్థ్యాల లోతైన ఆవిశ్కరణలను అందిస్తుంది. హబ్ యొక్క కీలక ఆవిష్కరణలలో ఒకటి దాని డ్యుయల్ కొనుగోలు అనుభవము. ఇది వినియోగదారులకు సహాయ అమ్మకాల ఇంటరాక్షన్స్ మరియు మొట్టమొదటి సహకారం-లేని ప్రయాణాల మధ్య ఎంపికను అందిస్తుంది. ఈ అంశము వినియోగదారులు ఫీచర్స్, ప్రయోజనాలను అన్వేషించుటకు మరియు తమ కొనుగోలును స్వతంత్రంగా పూర్తిచేయుటకు లేదా ఒకవేళ ఇష్టపడితే, వ్యక్తిగతీకరించబడిన, నిపుణుల మార్గదర్శనాన్ని అందుకొనుటకు వినియోగదారులకు అధికారాన్ని ఇస్తుంది. ఈ బహుముఖ వైఖరి వినియోగదారుడి వైవిధ్యభరితమైన ప్రాధాన్యతలను నెరవేరుస్తుంది మరియు వినియోగదారుడి-మొదటి రీటెయిల్ అనుభవాన్ని సృష్టించుటలో మాటర్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, మొహాల్ లాల్ భాయ్, వ్యవస్థాపకులు, సీఈఓ, మాటర్ గ్రూప్ మాట్లాడుతూమొబిలిటి యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించుటకు మా నిబద్ధత యొక్క వాస్తవ వ్యక్తీకరణ అయిన  మాటర్ ఎక్స్పీరియన్స్ హబ్ ప్రారంభాన్ని ప్రకటించుటకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అహ్మదాబాదులో మా ప్రధాన రీటెయిల స్పేస్ ప్రారంభం, వినియోగదారులతో మా సంబంధాన్ని పెంచుకొనుటలో కీలకమైన చర్య. ఏఈఆర్యొక్క పరిచయముతో, మేము ఒక వినూత్న ఆవిష్కరణను అందించడమే కాకుండా మోటార్ బైక్ రంగములో వినియోగదారుడి అనుభవాన్ని పెంచుతున్నాము. వర్తమానము మరియు భవిష్యత్తులను రూపొందించే ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మేము కొనసాగిస్తుండగా, మా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ హబ్ నుండి ఏఈఆర్ డెలివరీలను ప్రారంభించుటకు మేమెంతో గర్విస్తున్నాము. విద్యుత్ మొబిలిటిని ముందుకు తీసుకెళ్ళడము పట్ల మా అంకితభావం మా నిరంతర ప్రయత్నాలలో స్థిరంగా నిలిచి ఉంటుంది.”అన్నారు
మాటర్ ఏఈఆర్‎ఏ ద్వి-చక్ర వాహనాల మొబిలిటిలో విప్లవాన్ని తెచ్చే వాగ్దానం చేసే తన భవిష్యత్ డిజైన్ మరియు వినూత్న సాంకేతికతల గురించి గర్విస్తుంది. మాటర్ ఏఈఆర్‎ఏ భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఈవి బైక్. 4 స్పీడ్ హైపర్-షిఫ్ట్ గేర్స్ తో అత్యధిక పనితీరును (5.4 క్షణాలలో 0 నుండి 60 కేఎంపిహెచ్) మరియు అదే సమయములో తక్కువ నిర్వహణ ఖర్చులను (కిమీలకు 25 పైసలు) అందిస్తుంది. ఇందులో థర్మల్ మేనేజ్మెంట్, పనితీరును మెరుగుపరచుటకు మరియు బ్యాటరీ మన్నిక మరియు పవర్‎ట్రెయిన్ కు సహాయపడే లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ మరియు పవర్‎ట్రెయిన్ ఉన్నాయి. ఒక చార్జ్ లో 170 కిమీల ధృవీకరించబడిన రేంజ్, 5-amp ఆన్ బోర్డ్ చార్జింగ్ సిస్టం (ఏదైనా 5 – amp ప్లగ్ తో భారతదేశములో ఎక్కడైనా చార్జ్) తో, నావిగేషన్ తో ఇంటర్నెట్-ఆధారిత కనెక్టెడ్ అనుభవాలు, 7” టచ్ స్క్రీన్ తో మ్యూజిక్ మరియు కాల్ ఫీచర్ వంటివి రైడర్స్ కొరకు ఉన్న కొన్ని భిన్నమైన అనుభవాలు.