వైధ్యమైన ప్రాతలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయిక లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడి యోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శతి)’ తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జైటింగ్ కథాంశంతో మెప్పించటానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, మాటలు: ఉదరు పొట్టిపాడు, ఆర్ట్: కోసనం విఠల్, ఎడిటర్: సతీష్ సూర్య.