ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా లావుడియా రాజు నాయక్

నవతెలంగాణ – బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎస్ఎఫ్ఐ 4వ మహాసభలో బొమ్మలరామారం మండలం కండ్లకుంట తండ గ్రామనికి చెందిన లావుడియ రాజు ను జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ… జిల్లా కార్యదర్శి గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర,జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, పెంచిన మేస్ కాస్మొటిక్ చార్జీలను అమలు చేయాలని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, గురుకులాల హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగా సమస్యలను పరిష్కరించని యెడల  ప్రభుత్వం యొక్క మేడలు వంచి  పరిష్కరించే విధంగా ఉద్యమం చేస్తానని, నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.