ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం 

Law Awareness Conference organized by Government Hospitals– హాజీరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి 
నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో   పశ్చిమ బెంగాల్  లో  జరిగిన సంఘటనని దృష్టి లో ఉంచుకొని పని చేసే ప్రదేశాలలో  లైంగిక వేధింపులు  న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి లో బుధవారం నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగ   జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కామారెడ్డి డాక్టర్, సిహెచ్, విఆర్ఆర్ వరప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్  రామ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కలకత్తాలో జరిగిన సంఘటనకు రెండు నిమిషా లు మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంచించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిధి హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి  మాట్లాడుతూ..  న్యాయ సేవాధికార సంస్థ యొక్క పని తీరు  ని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ముందుగా రిపోర్ట్ చేయాలనీ కోరారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన సంఘటన లో సుప్రీమ్ కోర్ట్ సుమోటోగా తీస్కొని టాస్క్ ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేసిందన్నారు. పనిచేసే ప్రదేశాలలో  రక్షణ కమిటీ  ఏర్పాటు చేయాలనీ  ఆసుపత్రి  సూపరింటెండెంట్  కి సూచించారు. అలంటి కమిటీలకు చట్ట బద్ధత  ఉంటుంది అని అన్నారు. అలాగే వైద్యులు డైనింగ్ డిక్లరేషన్ లో  ఇతర విషయాలలో  తీసుకోవాల్సిన జాగ్రత్త లు, వైద్యులకు వర్తించే చట్టాలను వివరించారు.  ఈ కార్యక్రమo లో   డిప్యూటీ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి బన్సీలాల్, ఆర్ ఎం ఓ యాదగిరి ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి,  ఆఫీస్ అసిస్టెంట్ సాయి ప్రణీత్,  వైద్యులు, నర్స్ లు, మెడికల్ ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు .