
నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సి.నారాయణరెడ్డి నీ బుధవారం నల్లగొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సి.నారాయణ రెడ్డి గారు గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి ఇపుడు జిల్లా కలెక్టర్ గా రావడం సంతోషకరం అని జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి, లతీఫ్ వంశీ,గిరి, జంగయ్య,సరస్వతి, మతిన్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.