నవతెలంగాణ-భగత్ నగర్ : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(AILU) న్యాయవాదుల క్యాలెండర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ శుక్రవారం జిల్లా కోర్టులో ఆవిష్కరించారు. న్యాయవాదుల సౌకర్యార్థం పాకెట్ క్యాలెండర్ ను ముద్రించిన ‘ ఐలు’ సంఘాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.వి. రాజ్ కుమార్, కార్యదర్శి బీమా సాహెబ్, ఐలు జిల్లా కన్వీనర్ జి.సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు లచ్చిరెడ్డి, గుణవథ్ సింగ్, రాచకొండ ప్రభాకర్, లక్ష్మణరావు, కే.సి మూర్తి, కత్రోజ్ ప్రభాకర్, జనార్దన్ గౌడ్, రాజేష్, తనుకు మహేష్, సతీష్,తిరుపతి, దిలీప్, హరికృష్ణ, భవాని, సవిత, లావణ్య, రజిని, అనూష, కన్నూరి సురేష్, మహేందర్, నరేష్,పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.