ఐలు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న వేములవాడ న్యాయవాదులు..

నవతెలంగాణ – వేములవాడ 
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 ,16 తేదీలలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులకు నూతన చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు వేములవాడ బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో  వృత్తి మెళుకువలు, రాబోయే కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ ను వేములవాడ బార్ అసోసియేషన్ తరపున  శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు పొత్తూరు అనిల్ కుమార్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, అయిల్నేని కిషోర్ రావు, వేముల సుధాకర్ రెడ్డి, పెంట రాజు, నక్క దివాకర్, జంగం అంజయ్య, రేగుల రాజ్ కుమార్, బొడ్డు గంగరాజు, గుజ్జె మనోహర్, బొజ్జ నరేష్, బొడ్డు ప్రశాంత్ కుమార్, బొజ్జ మహేందర్, కాతుబండ నర్సింగరావు, పంపరి శంకరయ్య, నేదురి అభిలాష్, కట్కం జనార్ధన్,  గోలి కిరణ్, కనికరపు శ్రీనివాస్, బీమా మహేష్ బాబు, మహిళ న్యాయవాదులు జక్కుల పద్మ, బూర సరిత, తమ్మిడి అన్నపూర్ణ, మొగిలి సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు.