నల్లా బ్యాడ్జీలతో న్యాయవాదుల నిరసన 

Lawyers protest with nallah badges– ప్రత్యేక న్యాయవాద వృత్తి రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జనగాం న్యాయవాది దంపతులు గద్దల అమృత రావు, గద్దల కవితా రావులపై లపై పోలీసుల దాడి నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపుమేరకు బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిరసన ఉద్దేశించి నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ..  న్యాయవాద దంపతులపై జనగాం పోలీసులు అకారణంగా దాడి చేసి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు విధి నిర్వహణ లో కేసుల వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడం హేమమైన చర్యని  అందుకు బాధ్యులైన పోలీస్ అధికారులు సీఐ ఎస్ఐ కానిస్టేబుల్ తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట కొత్తగూడెం  భద్రాచలం సిరిసిల్ల జిల్లాల్లో న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడం అక్రమ కేసులు మరణించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం శోచనీయమని అన్నారు. న్యాయవాదులకే రాష్ట్రంలో రక్షణ కరువైందని రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడిలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు పునరావృతం  కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తి నిర్వహణ గౌరవప్రదంగా ఉండేందుకు న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ  కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు ధోన్పాల్ సురేష్, నరేందర్ రెడ్డి, పరుచూరి శ్రీధర్, బిట్ల రవి నారాయణ, పులి జైపాల్, పుణ్య రాజ్, గోవర్ధన్, సత్యనారాయణ గౌడ్, హనుమంత్ రెడ్డి, గణేష్, బిక్షపతి, చెన్యా నాయక్, అంజలి, మాణిక్ రాజ్, ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు.