నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణ కాగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ ఖాజా అహ్మద్ ఇతర న్యాయ వాదులు హైకోర్టు లోని ఆయన ఛాంబర్ లో గురువారం కలిసి సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, స్టేట్ కన్వీనర్ ఖాజా అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా లీగల్ సెల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపరు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందించనున్నట్లు వారు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రాగానే ధరణి పోర్టల్ నవీకరణ, హైడ్రా రూప కల్పన, నూతన రెవెన్యూ చట్టాల నిర్మాణం పై ఉద్ధృతంగా పనిచేస్తోందని .ఈ క్రమం లో న్యాయ పరంగా ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లను లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోరాడనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో మమిన్ రోషన్ జమీర్, ఖాజా అర్హన్ అహ్మద్, నిసార్ అహ్మద్ ఇతర న్యాయ వాదులు పాల్గొన్నారు.