ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలి: జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్

నవతెలంగాణ -భిక్కనూర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగే విధంగా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు ఎన్ని కాన్పులు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ కాన్పులు జరిగే విధంగా సిబ్బంది అవగాహన కనిపించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హేమీమా, వైద్య సిబ్బంది ఉన్నారు.