
నల్గొండజిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం సాగర్ తిరుమలగిరి మండలం జమ్మంకోట తండాకు చెందిన రమావత్ లక్ష్యానాయక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సీఆర్పీ ఎఫ్ జవాన్ గా దేశ రక్షణ విభాగం లో పనిచేస్తున్నారు. ఆదివారం చెన్నై శిక్షణ కేంద్రంలో ఉత్తమ కమాండెన్స్ గా రమావత్ లక్ష్యానాయక్ ఎంపిక కావడం తో డిప్యూటీ కమాండెంట్ విజయ్ కుమార్ చేతుల మీదుగా బెస్ట్ ఫీజికల్ ఇంస్ట్రుక్టర్ కమాండెన్స్ అవార్డు తోపాటు సర్టిఫికెట్ అందుకున్నారు.మొత్తం 1000 మంది శిక్షణలో పాల్గొనగా లక్ష్యానాయక్ కు బెస్టు ఫిజికల్ కమాండెన్స్ అవార్డు రావడం పట్ల జిల్లా లోనే కాక నాగార్జున సాగర్ నియోజకవర్గం, వారి సొంత గ్రామంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ అవార్డు,సర్టిఫికెట్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రమావత్ లక్ష్య నాయక్ అంనందం వ్యకం చేశారు.