నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి కేటీఆర్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఐటీ శాఖ మాజీ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజరు కారంపూరి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. అనార్యోగంతో మృతి చెందిన సుజరు తండ్రి ప్రొఫెసర్ సుభాష్ మృతదేహానికి నివాళులర్పించారు.