– కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బోనెపల్లి రఘుపతి రెడ్డి
నవతెలంగాణ – శాయంపేట : జోడోయాత్రతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బోనెపల్లి రఘుపతి రెడ్డి అన్నారు. మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ మండల నాయకులు రఘుపతి రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర క్యాబినెట్లో వచ్చిన అవకాశాన్ని తృణప్రాయంగా వదిలీ వేశారని గుర్తు చేశారు. రాబోయే రోజులలో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నిక కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు వైద్యుల ఆదిరెడ్డి, నాయకులు పోలేపల్లి అశోక్, మోరే శ్రీను, రాజయ్య, గంగాడి సుధాకర్ రెడ్డి, కూరాకుల రాజు, వైద్యుల వెంకట్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, రామ్ రెడ్డి, పిట్టల సంజీవయ్య, బోయిని పైడి, కూరాకుల సంతోష్, చిలుకల రవి, తదితరులు పాల్గొన్నారు.