
నవతెలంగాణ-మద్నూర్
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే గెలుపు కోసం ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రజలకు వివరిద్దాం పట్టుదలతో నాయకులు కార్యకర్తలు పని చేద్దామంటూ క్రిస్టియన్ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ప్రత్యేక సమావేశం మేనూర్ లో బీఆర్ఎస్ మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి వై గోవిందు గృహం నందు నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి ఇరు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తూ పట్టుదలతో పని చేద్దాం అనుమంతు షిండే గెలుపుకు కృషి చేద్దామని తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ రాజేశ్వరి కు వై గోవింద్ ఆధ్వర్యంలో శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ మైనారిటీ నాయకులు మోహిన్ పటేల్ మేనూర్ ఎంపిటిసి సభ్యులు మందాకిని శ్రీనివాస్ గౌడ్ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్ ఇరు మండలాల పరిధిలోని సర్పంచులు ఎంపిటిసిలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.