
మండలంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షుడు మాదారావ్ దేశాయి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు జుక్కల్ మండలానికి నూతనంగా పదవి బాద్యతలు తీసుకున్న ఎంపిడివో శ్రీనివాస్ ను సన్మానించారు. మంగళ వారం నాడు ఎంపిడివో కార్యాలయానికి మండలం లోని నాగల్ గావ్ , మాదాపూర్, చండేగాం, లాడేగాం, హంగర్గ, చిన్న గుల్లా, బస్వాపూర్, జుక్కల్, కౌలాస్, జీపీల మాజీ సర్పంచులు సాంప్రదాయంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో యాదగిరి, మాజీ సర్పంచులు తదితరులు పాల్గోన్నారు.