నియోజకవర్గం నుండి దాదాపు 200 మంది రామ భక్తులు అయోధ్య రామ మందిర దర్శనానికి మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరడం జరిగింది. సుమారుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీల నుండి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు రామ భక్తులు ఎంతో సంతోషంతో బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీకన్వీనర్ పాలెపు రాజు ,అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు భూపతి రెడ్డి పెద్దల గంగారెడ్డి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.