
తెలంగాణ రాష్ట్ర ముడవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ టి పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారనికి డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలల నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్ లో అధ్వర్యంలో గురువారం భారీగా తరలివళ్ళి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి నుంచి ముందుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం స్టేడియానికి చేరుకున్నాట్లు వివరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రజాకర్షణ గల నేత రేవంత్ రెడ్డి అని, అలాంటి నాయకుడికి సీఎం బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ దీర్ఘ దృష్టితో ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ లపై మొదటి సంతకం చేశారని,రెండవ సంతకం ఒక వికలాంగ నిరుద్యోగికి ఉద్యోగం అందజేసి ఇచ్చిన హామీ నేటి అమలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజలకు కావలసిన సంక్షేమం, అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళ్తుందని సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అన్నీ మండలాలు, గ్రామాలు కొత్త పుంతలో పురోగతిస్తాయని ఆశాభావాన్ని అమృత పూర్ గంగాధర్ నవీన్ గౌడ్ వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి డిసిసి డెలిగేట్స్ వసుబాబు, దర్మగౌడ్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాంసన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నరు.