
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాసంక్షేమంపై అవగాహన లేని అవినీతి పరులు బీఆర్ఎస్ నాయకులని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ నాయకులపై శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా ప్రాధేయపడిన నేపథ్యంలో మంథని ప్రజలు సేవలందించాలని ప్రస్తుత బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జికి 2014లో ఒక్క అవకాశం ఇస్తే వందలాది కోట్ల అవినీతి ఆస్తులు,హత్యలు,బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు గొర్రెలు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ సొసైటీలో అవినీతి ఆరోపణలతో సంవత్సరం కాలం సస్పెన్షన్ అయినట్లుగా పేర్కొన్నారు. గల్లి నుంచి డిల్లీ దాక బిఆర్ఎస్ నాయకులకు ప్రజా సంక్షేమం పై అవగాన,శ్రద్ధ లెవ్ కానీ అక్రమ వసూళ్లు, అవినీతి, స్కామ్ లపై మాత్రం పుష్కలంగా అవగాహన ఉందన్నారు.2007లో ఉన్న పరిస్థితి, నేటి పరిస్థితి ఏమిటో బేరీజు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,సింగిల్ విండో డైరెక్టర్లు రమేష్,ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు పాల్గొన్నారు.