
కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న బీ ఆర్ఎస్ నాయకులు బొమ్మలరామారం మండలం నుండి బీఆర్ఎస్,ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు జరిగాయి. భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడిరాంరెడ్డి,చౌదర్ పల్లి గ్రామ శాఖ,మండలం యాదవ సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్, శుక్రవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ,సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. విరితో పాటు హాజీపూర్,చౌదరిపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గెలిచిన వంద రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని. ఆలేరు నియోజకవర్గం లో భారీ మెజార్టీతో గెలిపించినట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీ ఇచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీ ల అమలు చేసిందని,రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు న్యాయ్ లు,25గ్యారెంటీ లను కూడా పార్లమెంట్లో అభ్యర్థిని గెలిపించుకుంటే రాష్ట్రంలో ఇటు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో అమలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.