ఏపీ మంత్రి నాదెండ్లను సన్మానించిన చౌటుప్పల్ నాయకులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల మనోహర్ రావు ను చౌటుప్పల్  మండలానికి చెందిన నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోనే ఆయన స్వగృహానికి వెళ్లి నూతనంగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోర్నాల వాసుదేవ్, పగుడాల అంజయ్య, పొట్ట జంగయ్య గౌడ్, కందగట్ల రామకృష్ణ, మీసాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.