నవతెలంగాణ – జుక్కల్
దేశ వ్యాప్త సమ్మే పోస్టర్ ను జిల్లా సీఐటీయూ నాయకులు విడుదల చేయడం జరిగింది. ఈ సంధర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో ఆశాలు, అంగన్ వాడీలు , మద్యహన బోజన నిర్వహకులు, గ్రామ పంచాయతి కార్మీకులు సమన్వయ కమిటి సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటి సబ్యులతో కలిసి సమ్మే పోస్టర్ ను అవిష్కరించడం జరిగింది. ముఖ్య అథితిగా హజరైన జిల్లా కమిటి కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతు ఫిభ్రవరి 16వ తేదిన దేశ వ్యాప్త సమ్మే గ్రామీణ భారత్ ను జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రజా, కార్మీక రైతు వ్యతిరేక విధానలను అమలు చేస్తు సామన్య ప్రజల కార్మీక కర్షక హక్కుల పై దాడీ చేస్తున్నదని ఈయన ఆరోపించారు. మాటల్లో జాతీయత అని ఆచరణలో పూర్తీగా విదేశీ జపం చేస్తోందని , దేశంలో అన్ని అర్థిక వనరులు సమకూర్చే ప్రభూత్వ రంగాలను దేశంలో కుభేరులైనటువంటి వారికి చౌకగా అమ్మేయడం జర్గుతోందని కేంద్ర ప్రభూత్వ వైఖరి పైన మండిపడ్డారు. ఈ సమ్మేలో వివిధ రంగాల విధులులనిర్వహిస్తున్న కార్మీక ,కర్షక లోకం ఙారీగా సమ్మేలో పాల్గోని విజయవంతం చేయాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల నాయకులు తదితరులు పాల్గోన్నారు.