ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన ఎరుకల సంఘం నాయకులు..

The leaders of Erukala Sangam met the Chairman of SC and ST Commission.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భూదాన్ పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసీలకు కుటుంబాన్ని చెందిన వారి గుడిసెను తొలగించి వారిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ చైర్మన్ ను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలిసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుత్తాడి సురేష్ తెలిపారు. బుధవారం హైదరాబాదులో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కమిషన్ కలిసి విన్నవించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ ఎరుకల కుటుంబానికి చెందిన కూతాటి ప్రేమలత యాదగిరి  పూరిగుడిసెను  కూల్చేసిన భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరుతూ బాధితులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని  ప్రభుత్వపరంగా ఆర్థిక  సహాయంతో పాటు ఉపాధి అవకాశం కల్పించాలని కోరగా.. వెంటనే ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్  స్పందించి స్థానిక డిజిపి ఎసిపి కి ఫోన్ చేసి తక్షణమే అరెస్టు చేయాలని వారిని రిమాండ్ కు పంపాలని వారి పైన చర్యలు తీసుకోవాలని తగిన ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారని, జిల్లా కలెక్టర్ కు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్, ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం,  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్, కూతాడి యాదగిరి లు పాల్గొన్నారు.