నవతెలంగాణ-కోహెడ
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ బీఆర్‌ఎస్ పార్టీ నుండి మూడవసారి ఎమ్మెల్యేగా టికెట్ రావడం పట్ల మంగళవారం హుస్నాబాద్ క్యాంపjర్ కార్యాలయంలో కోహెడ గ్రామశాఖ అధ్యక్షుడు బండ వెంకటస్వామి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, రానున్న ఎన్నికలలో హ్యట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంద రాజయ్య, నాయకులు ఉల్లి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి బబ్బురు శ్రీనివాస్‌గౌడ్, తలారి నర్సయ్య, బందెల రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.