చెన్నైలో జరిగిన 16 విద్యార్థి సంఘాల ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నాయకులు

– నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెన్నైలో ర్యాలీ
– ర్యాలీలో పాల్గొన్న ఎస్ ఎఫ్ ఐ నాయకులు 
నవతెలంగాణ – కంటేశ్వర్
చెన్నైలో జరిగిన 16 విద్యార్థి సంఘాల ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెన్నైలో గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొని నిజామాబాద్ జిల్లా తరఫున మాట్లాడారు.భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)  దక్షిణాది రాష్ట్రాలలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చలో చెన్నై పిలుపులో భాగంగా 16 విద్యార్థి సంఘాల విద్యార్థి ప్రతినిధులతో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  బొడ అనిల్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం  దక్షిణ రాష్ట్రాలలో బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు .నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థుల, విద్యావేత్తల సూచనలు లేకుండా నేరుగా పార్లమెంట్లో అమలు చేసి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు వీటితోపాటు ఈ నూతన జాతీయ విద్యా విధానం పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో విద్యాని అప్పగించేందుకే తీసుకువచ్చారని అన్నారు శాస్త్రీయ విద్యా విధానానికి ఇందులో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు వీటితోపాటు అయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించింది నాలుగు సంవత్సరాలు డిగ్రీ ప్రతిపాదన సరైంది కాదని అన్నారు. ఇలాంటి జాతీయ విద్యా విధానం విపత్తు గా మారిందని అవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ప్రైవేటీకరణ కు, కార్పొరేటికరణ కు వత్తాసు పలుకుతుంది  అని అన్నారు. అదేవిధంగా పి హెచ్ డి స్కాలర్లకు వచ్చే స్కాలర్షిప్స్ లలో కోతలు విధిస్తుందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది గలాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం ప్రధాన లక్ష్యంగా దక్షిణ రాష్ట్రాల విద్యార్థి సంఘాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. విద్య రంగానికి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేష్, దీపిక నాయకులు వేణు,జవహర్,సందీప్, బాపు రావు, తెలంగాణా యూనివర్సిటీ నాయకులు శివ, సురేష్, పూజా, అభిషేక్ తదితర నాయకులు పాల్గొన్నారు.