మంత్రుల నివాసాలను ముట్టడించిన తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేతలు

Leaders of Telangana BC student union besieged ministers' residences– ఫీజు బకాయిలు చెల్లించాలంటూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ముట్టడి.
– అడ్డుకున్న పోలీసులు. .
నవతెలంగాణ-హైదరాబాద్
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలంటూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని మంత్రుల నివాసాలను ముట్టడికి ప్ర‌య‌త్నించిన నాయ‌కుల‌ను అరెస్టు చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంద్బంలో బీసీ విద్యార్థి సంఘం నేతలకు పోలీసుల‌కి మ‌ద్య‌ తోపులాట జ‌రిగింది. దీనితో భారీగా పోలీసులు మోహరించడం జ‌రిగింది.
ఈ సంద్బంగా విద్యార్థులను ఉద్దేశించి వేముల రామకృష్ణ ప్రసంగిస్తూ ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రియంబర్స్ మెంట్ పథకం పెట్టిన  16 సంవత్సరాల సమయంలో సమాజంలో పెద్ద ఎత్తున గుణాత్మకమైన పరిణామాలు జరిగాయి అన్నారు. ఒక క్రమ పద్ధతిలో జ్ఞాన సమాజం ఏర్పాటుతుందని, పల్లెలలో ప్రతి ఇంటిలో ఇద్దరు-ముగ్గురు ఇంజనీరింగ్, డిగ్రీ చదివారు అని అయ‌న అన్నారు.పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు పాల్గో‌న్నారు