కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికీ మద్దతు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం  కాంగ్రెస్ పార్టీ నిజామాబాదు అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ కి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు ప్రకటిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రెండు పార్టీలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.