
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ జిల్లా అధ్యక్షుడు మాలల మోహన్ రెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భీంగల్ మండలంలోని రహత్ నగర్ గ్రామానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని దీనిని గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్సీగా నియమించడం అభినందనీయమని నాగేంద్ర తెలిపారు. ఎమ్మెల్సీ ని కలిసిన వారిలో మండల కాంగ్రెస్ నాయకుడు వాక మహేష్ ఉన్నారు.