మండలంలోని పంభాపూర్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎల్లబోయిన బిక్షపతి ద్వితీయ కుమారుడు ఎల్లబోయిన పవన్ కళ్యాణ్ దశదినకర్మకు ఆదివారం నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి మడి బిక్షపతి, మాజీ సర్పంచ్ లు ఇర్ప సునీల్ దొర, నరసింహ స్వామి, రాంబాబు, తుర్గ వీరబాబు లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మంచి వ్యక్తి అని ఆయన చిన్న వయసులోనే మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.