
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;
నవతెలంగాణ మోపాల్:
గురువారం రోజున మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదిక సమీపంలో వివిధ గ్రామాలకు చెందిన 20 కుంటలకు రూ.4,34,700/- చేప పిల్లలని పంపిణీ చేశామని కాంగ్రెస్ పార్టీ మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ డి సి సి బ్యాంక్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాణ్యమైన చేపలను పంపిణీ చేయకుండా మత్స్యకారులను మోసం చేశారని కేవలం వాళ్ళ కమిషన్ల కొరకు ఏదో తుతూ మంత్రంగా వారు పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తూ అలాగే వాటి సైజు 35 నుండి 40 సెంటీమీటర్ల పొడవు ఉందని వారు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నాణ్యత లేని చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల మత్స్యకారులు అందరం ఎంతో ఆర్థికంగా నష్టపోయామని కానీ ఇప్పుడున్న మన ప్రభుత్వంలో కచ్చితంగా నాణ్యతతో కూడుకున్నవి మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు రమేష్, రాములు ఎంపీడీవో రాములు నాయక్, ఏవో సౌమ్య, రాష్ట్ర పంచాయతీ సెక్రెటరీ పోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.