షబ్బీర్ అలీకి వినతి పత్రం ఇచ్చిన నాయకులు..

Leaders who gave a petition to Shabbir Ali..నవతెలంగాణ – కామారెడ్డి ( బిబిపేట్ )
బిబిపేట మండల కేంద్రంలో  డివైడర్ – సెంటర్ లైటింగ్, మండల అబ్బివృది పనులకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీ ల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి  వినతి పత్రం అందజేసినట్లు బిబిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతరి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీబీపేట మండల హెడ్ క్వాటర్ తో పాటు పలు గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించలని ఆయనకు ఇచ్చిన వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు. బీబీపేట్ మండలం 10 గ్రామాలతో నుతంగా ఏర్పడ మండలం (ప్రస్తుతం 11 గ్రామాలతో బీబీపేట్ మండలం కలిగి ఉన్నది) మా మండలం గత ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదాని, మండలం నుండి గ్రామలకు వెళ్లాలంటే సరిగ్గా రోడ్ సౌకర్యం లేనందున ప్రజలు రాకపోకలకు చాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. రోడ్ల నిర్మాణం  రాంరెడ్డిపల్లి నుండి అంబారిపేట్ బీటీ రోడ్, తుజల్ పుర్ నుండి నందగోకుల్ బీటీ రోడ్, శివరాంరెడ్డిపల్లి నుండి మానేరు డ్యాం బీటీ రోడ్, బీబీపేట్ ఎస్సీ కాలనీ నుండి నందగోకుల్ బీటీ రోడ్, యడారం రోడ్ నుండి చెలక బీటీ రోడ్, బీబీపేట్ బస్టాండ్ నుండి తాసిల్దార్ ఆఫీస్ బీటీ రోడ్, వి సాయినాథ్ ఇల్లు నుండి కుమ్మరి గల్లి ( బల్ల పోచయ్య హౌస్) బీటీ రోడ్, హనుమాన్ గుడి నుండి ముదిరాజ్ గల్లి  ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ వరకు బీటీ రోడ్, ఇలా చాల రోడ్ నిర్మాణం చేపటాల్సి ఉన్నది.  ఇట్టి రోడ్ లను నిర్మాణం చేపట్టి బీబీపేట్ మండల ప్రజలను ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. వీటితోపాటు బిబిపేట మండల కేంద్రంలో డివైడర్, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని,  బీబీపేట్ మండలం 10 గ్రామాలతో నుతంగా ఏర్పడ మండలం (ప్రస్తుతం 11 గ్రామాలతో బీబీపేట్ మండలం కలిగి ఉన్నది). మా మండలం గత ప్రభుత్వ హయంలో ఎలాంటి అబివృదికి నోచుకోలేము. బీబీపేట మండలం జిల్లా సరిహద్దులో ఉన్నదున్న అబివృద్ధి లో చాల వెనుకబడి ఉన్నది. కావున బీబీపేట్ మండల హెడ్ క్వాటర్ లో డివైడర్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని షబ్బీర్ అలీ కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బిబిపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.