నవతెలంగాణ-ఆర్మూర్
బిజెపి పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ గా నియామకం చేయడాన్ని హర్షిస్తూ పెద్దోళ్ల గంగారెడ్డి స్వగృహంలో సోమవారం వారిని ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ గా నియామకం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , తన నియామకానికై ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడమైనది. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అదేవిధంగా తనను సన్మానించిన ఆర్మూర్ పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పెద్దోళ్ల గంగారెడ్డి బిజెపిలో చురుకుగా పనిచేసి బిజెపి పార్టీ అభివృద్ధికై కృషి చేయడం జరిగిందని. గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్న తనను కరీంనగర్ పార్లమెంట్ (ప్రభారి) ఇంచార్జ్ గా నియామకం చేయడాన్ని హర్షిస్తూ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేయడమైనది. ఇలాంటి ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో చేస్తూ పార్టీ అభివృద్ధికై కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, నల్ల రాజారాం, మందుల వీర బద్రి, కుక్నూర్ లింగన్న, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, గోవింద్ పెట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, మీసాల రాజేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణం కృష్ణా గౌడ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్ కర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.