
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో జరిగే బహిరంగ సభకు జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సంగారెడ్డికి శనివారం తరలి వెళ్లారు. జిల్లా కేంద్రం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డికి బయలుదేరిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నారు అని తెలిపారు. ఈ బహిరంగ సభలో పార్టీ అఖిల భారత నాయకులు బృంద కరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర, రాష్ట్ర నాయకులు ప్రసంగం చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల పై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అదే విధంగా గత 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటం, సాధించిన విజయాలు, వైఫల్యం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ మహాసభలో జరుగుతోంది. అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంంకట్ రాములుు, జిల్లా నాయకులు విగ్నేష్, సురేష్, నగర నాయకులు నర్సయ్య, అనిత, అనసూయ మ్మ, సుజాత, ఈ వి ఎల్ నారాయణ, సతీష్, సూచిత తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నవీపేట్,బోధన్, ఆర్మూర్, వర్ని, తదితర ప్రాంతాల నుండి బయలుదేరి వెళ్ళారు.