టీపీసీసీ అధ్యక్షున్ని కలిసిన నాయకులు

Leaders who met the President of TPCCనవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండలం రాహత్ నగర్ గ్రామానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడిగా మొదలుపెట్టి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న విషయం తెలిసినదే. అయితే ఇకనుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను భీంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరే స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ ,ఎస్టీ సేల్ మండలాధ్యక్షులు అనంతరావు ,గోపాల్ నాయక్, బిసి సేల్ మండల అధ్యక్షులు కొరడి రాజు వేముగంటి రాజేశ్వర్, అరిగెల జనార్ధన్, భీంగల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  దైడి.సురేష్, మహమ్మద్ అబ్దుల్ జుబైర్, సయ్యద్ నవీద్ భాయ్, జిషన్, అద్నాన్ తదితరులు పాల్గొన్నారు.