
నల్లగొండ,ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను సోమవారం తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హైదారాబాద్ లోని క్యూ న్యూస్ కార్యాలయంకు వెళ్ళి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ దత్తాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరుప్పల మల్లేశ్,ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి మల్లేశ్ యాదవ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధానబోయిన మల్లేషం పాల ఉత్పత్తి దారుల సంఘం చైర్మెన్ జిట్ట కిషన్ యాదవ్,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దానబోయిన నవీన్ బూత్ అధ్యక్షుడు గాజె మల్లేశం,గ్రామశాఖ ఉపాధ్యక్షుడు కోడారి పర మేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.