ఎమ్మార్పీఎస్ దండోరాకి తరలి వెళ్లిన నాయకులు

Leaders who moved to MMRPS Dandoraనవతెలంగాణ – రామారెడ్డి
సికింద్రాబాద్లో తలపెట్టిన ఎమ్మార్పీఎస్ విజయ దండోరా ర్యాలీ మహోత్సవానికి మండల నాయకులు మంగళవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు యాదగిరి మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని అన్నారు. తరలి వెళ్లిన వారిలో జిల్లా నాయకులు యాదగిరి, రాజనర్సు, బాణాపురం లావణ్య, ఎల్లన్న, సాయిలు, శైలేష్ తదితరులు ఉన్నారు.