ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు

నవతెలంగాణ – మద్నూర్
శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ గురూజీ, మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాసు పటేల్, మండలంలోని తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ ఎంపీటీసీలు, మండలంలోని గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.