అర్హులైన లబ్ధిదారుల రేషన్ కార్డుల సర్వేలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో స్థానిక కౌన్సిలర్ మెడిదాల సంగీత రవి గౌడ్ అద్వర్యం లో నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ,అర్హులైన లబ్ధిదారుల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్ను భాయ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విట్టం జీవన్ మున్సిపల్ మాజి ఛైర్మెన్ పండిత్ పవన్ ,,కౌన్సిలర్ లు హన్మండ్లు గారు,రవి గౌడ్ గారు,ఆర్మూర్ ,మరియు ఆలూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ గారు,చిన్న రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి ,నవీన్ రెడ్డి పాల్గొన్నారు.వినయ్ అన్న గారు ఇందిరమ్మ కాలనిలో వివరాలను అడిగి తెలుసుకొని ,ఇందిరమ్మ కాలనిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినవే అని చెప్పడం జరిగింది.నిజమైన పేద వారికి లబ్ది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అన్ని చెప్పారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు మంజూరి అయ్యేవిధంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను,కాంగ్రెస్ నాయకులకు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.