బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు..

నవతెలంగాణ – ఏర్గట్ల
మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శివరాత్రి రవి ఇటీవలే అకాల మరణం పొందాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో… గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరు ఒకేచోట చేరి బాధిత కుటుంబానికి రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇక ముందు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుంటాం అని భరోసాను అందించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం,తాళ్ళ రాంపూర్ మాజీ సర్పంచ్ భానుప్రసాద్, నాయకులు అంజిరెడ్డి, బోనగిరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.