శ్రీశైలం పరామర్శించిన నాయకులు

నవతెలంగాణ – సిద్దిపేట
 భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీశైలం కూతురు మెదడులో అనారోగ్య సమస్యలతో నిమ్స్ లో చేరారని, ఆయనను నిమ్స్ లో కలిసి పరామర్శించడం జరిగిందని బి ఎన్ ఆర్ కే ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు ఈర్ల సత్యం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అనారోగ్య విషయాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండము సంపత్ రెడ్డి లు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆపరేషన్ కు అయ్యే ఖర్చుకు సంబంధించిన ఎల్ఓసిని ఇప్పించాడని తెలిపారు. అదేవిధంగా బిఎన్ఆర్ కే ఎస్  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంజాల మల్లేశం, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పాలడుగుల శివకుమార్,  హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎండి సాదిక్,  హనుమకొండ టౌన్ అధ్యక్షులు సిరికొండ బిక్షపతి,  ప్రధాన కార్యదర్శి గంగాధర్ రాజు,  సిద్దిపేట టౌను సెక్రెటరీ కొత్త కనకయ్య, చిన్నకోడూరు మండల సెక్రెటరీ  మిట్టబోయిన రవి,  కార్మిక పెద్దలు గీత సాయిలు,  కప్ప చంద్రం,  గోవింద కనకయ్య, చిన్నారావు, తదితరులు ఉన్నారని తెలిపారు.