ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వీక్షించిన నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్: బిజెపి పట్టణ శాఖ, మండల శాఖ ఆధ్వర్యంలో “మెరా బూత్ — సబ్ సే మజ్ బూత్” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గృహం అంకాపూర్ నందు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బిజెపి అసెంబ్లీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి పట్టణ మరియు మండల అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.