ప్రజల వృదాయాలను గెలుచుకున్న నాయకులు..

నవతెలంగాణ-తొగుట
ప్రజా జీవితంలో ఎంపీపీ, ఎంపీటీసీలుగా అలుపెర గని సేవలు చేసి ప్రజల హృదయాలను గెలుచుకు న్నారని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువా రం తొగుట ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, పెద్ద మసాన్ పల్లి ఎంపీటీసీ సుమల త కనకయ్య, వెంకట్రావుపేట ఎంపీటీసీ కంకణాల నర్సింలు, వేములఘట్ ఎంపిటిసి గణపురం కల్ప న మల్లేశం, ఎటిగడ్డ కిష్టాపూర్ ఎంపీటీసీ కనకలక్ష్మీ లక్ష్మీనారాయణ, కో-ఆప్షన్ సభ్యులు కలిముద్దీన్ లను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లపాటు ప్రజా జీవితంలో ఎంపీపీ, ఎంపీటీసీలుగా మెరుగైన సేవ లు చేశారని కొనియాడారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అభినందించారు. ఈ కార్యక్ర మంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో- ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య, మైపాల్ రెడ్డి,  మాజీ సర్పంచులు బుర్ర నర్సింలు, తోయేటి ఎల్లం  పాత్కుల వెంకటేశం, జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సిద్ధి శ్రీనకర్ రెడ్డి, రాంరెడ్డి, ఉప్పలయ్య, కొంగారి నర్సింలు, ఎల్లారెడ్డి ఆన్సర్, రాములు, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొ న్నారు.