– విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్
నవతెలంగాణ – భువనగిరి
విద్యార్థులు శాస్త్రీయవిజ్ఞానాన్ని నేర్చుకోవాలని విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు టి. రమేష్ తెలిపారు. సోమవారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో, అమర్ టెంట్ హౌస్ భువనగిరి సహకారంతో మహిళలకు, చిన్నారులకు ఆరే విజయకుమార్ అధ్యక్షతన వేరువేరుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు విద్యనుర్జించి శాస్త్రీయ దృక్పథం నేర్చుకోవాలన్నారు. ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. మూఢనమ్మకాలు తొలగించుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వేసే ముగ్గులు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు ఆ ముగ్గుల స్థానంలో సంస్కృతితో పాటు ప్రజలను చైతన్యవంతం చేసే ముగ్గులు రావాలని కోరారు ప్రతి ఒక్కరి సొత్తు కాదని ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదువుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఈ దేశాన్ని మహిళలు పరిపాలించిన చరిత్ర ఉందన్నారు. నేడు దేశ రాష్ట్రపతి ద్రౌపది మురుగు ఉందని విషయాన్ని గుర్తు చేశారు. వారు రాణించిన రీతిలోనే ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో రాణించాలన్నారు. పిల్లలు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ లను తెలుసుకోవాలన్నారు .కళాశాలలో ర్యాగింగ్ పై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలపాలని కోరారు. నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెద్ద ఎత్తున వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 30 నుండి 35 శాతం మంది మహిళలు తమ భర్త తాగుడు వల్ల వితంతువులు అవుతున్నారని వారు వితంతు పెన్షన్ కు దరఖాస్తులు పెడుతున్నారన్నారు. ఆ కుటుంబాలు వీధుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. మద్యాన్ని మాన్పించడానికి మహిళలకు కృషి చేయాలన్నారు. దేశానికి , సమాజానికి ప్రమాదమని తెలిపారు .వై ఎల్ ఎన్ ఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద మాట్లాడుతూ భువనగిరి పట్టణం హనుమాన్ వాడలో 30 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలను క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలు ఆనందం కోసం మాత్రమే కాదని జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యము అన్నారు. నేడు దేశంలో మహిళల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి ప్రభుత్వము, ప్రజలు ముందుకు రావాలన్నారు .నిరుపేదలు, కుటుంబ పరిస్థితులు, కోపంతోటి ఇల్లును విడిచిన మహిళలను, చిన్నారులను ప్రలోభ పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల నుండి బయట పడాలని కోరారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. న్యాయ నిర్ణయాలుగా కొలుపుల శ్రీనిజ, సోను, నిక్కిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బర్ల వెంకటేష్, నాయకులు వడ్డె కృష్ణ విద్యార్థి నాయకులు కొలుపుల నిఖిలేశ్వర్, అజయ్ సింగ్, భీమ్ రాజ్, అరిగే విక్రాంత్, బర్గే కిరణ్, వినోద్, కొలుపుల సోహన్ పాల్గొన్నారు.