మేడారం ఇంగ్లీష్ మీడియంలో లెర్నింగ్ ఈక్విలైజర్ ప్రోగ్రాం 

– విద్యార్థులకు జండర్ కరప్షన్ అండ్ లైఫ్ స్కిల్స్ పై పరీక్ష
నవతెలంగాణ -తాడ్వాయి 
మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ట్రాన్స్ఫార్మ్ స్కూల్ సంస్థ ఆధ్వర్యంలో క్వాల్కం   వారి ఆర్థిక సాయంతో మేడారం ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయులు సాయిబాబా ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిలకు జెండర్ పర్సెప్షన్ అండ్ లైఫ్ స్కిల్స్ పై పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు స్టెమ్ ఇన్నోవేషన్ మరియు లెర్నింగ్ సెంటర్ ద్వారా సామాజిక బాధ్యతలను నేర్చుకునేలా కృషి చేస్తారని అన్నారు. 6 మండలాలలో 20 పాఠశాలలను విద్యార్థులకు జండర్ ప్రొప్షన్ అండ్ లైఫ్ స్కిల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయులు సాయిబాబా, ట్రాన్స్ఫార్మ్ స్కూల్ సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.