
– మావోయిస్టు దామోదర్ తల్లిని కలిసి నిత్యవసర సరుకులు అందజేత
నవతెలంగాణ – తాడ్వాయి
కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ లో కొనసాగుతున్న అగ్రనేతలు, సభ్యులు వ నం వీడి జనంలోకి వచ్చి జనజీవన స్ర వంతిలో కలువాలని పస్రా సీఐ శంకర్, తాడ్వాయి స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి లు అన్నా రు. శుక్రవారం తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే దామోదర్ తల్లి బడే బతుకమ్మను ఆమె నివాసంలో, జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు సీఐ, ఎస్ఐ లు పోలీసులతో కలిసి వచ్చి ఆమెను కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పోషణను అడిగి తెలుసుకుని బియ్యం ఉప్పు పప్పు కారం నూనె సబ్బులు రెండు నెలలకు సరిపడు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల చతిస్గడ్ లోని పరిణామాల దృష్ట్యా వనం వీడి జనంలోకి రావాలని, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి బతుకమ్మ ఆదుకోవాలని కోరారు. పోలీస్ శాఖ నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించి అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు.
అజ్ఞాతంలో ఉండి కన్న వారికి, తోబుట్టువులకు దూరంగా ఉంటూ మావోయిస్టు పార్టీ ఒత్తిడితో దళంలో కొనసాగుతున్నారని తెలిపారు. ముఖ్య నేతలందరూ అనారోగ్యంతో మృతి చెం దుతున్నా కేంద్ర కమిటీ దాట వేత ధోరణి ప్రదర్శిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసే ముఖ్య నే లకు, కింది స్థాయి కేడర్‌కు పోలీస్ శాఖ ద్వారా అన్ని విధాలా సహకారం అందించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా దామోదర్ తల్లి బతుకమ్మ ‘ఒంటరిగా ఉండలేక పోతున్నాను ఇంటికి రా బిడ్డ నిన్ను చూడాలనిపిస్తుందని’ కన్నీటి పర్యం తం కాగా సీఐ ఎస్ఐలు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హా మీ ఇచ్చారు. వారి వెంట స్థానిక పోలీసులు, తదితరులు ఉన్నారు.