
ప్రభుత్వ విద్య వల్ల కలిగే లాభాలను పురాని పెట్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ విద్య ఏ ప్రగతికి మెట్టు అని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని అలాగే అర్హులైన టీచర్లచే విద్యాబోధన తోపాటు దుస్తులు, భోజనం అందజేయబడుతుందని కనుక ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు చెప్పించాలని కోరారు. ఎందరో మంది మేధావులను అందించిన ఘనత ప్రభుత్వ పాఠశాలలకు ఉందని తెలిపారు. కనుక బుధవారం వసంత పంచమి సందర్భంగా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎల్ కేజీ, యూకేజీ దరఖాస్తులకు తీసుకోనున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పురానిపేట వి డి సి సభ్యులు, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు ఎడ్ల శేఖర్ పాల్గొన్నారు.